Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబస్సు ఢకొీని వృద్ధురాలు మృతి

బస్సు ఢకొీని వృద్ధురాలు మృతి

- Advertisement -

– టైర్‌ కింద నలిగిపోయిన వైనం
– రహదారి ఆక్రమణలే కారణం..!
నవతెలంగాణ : పరకాల

హనుమకొండ జిల్లా పరకాల పట్టణ నడిబొడ్డున బస్టాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ములుగు జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే… వరంగల్‌-2 డిపోకు చెందిన బస్సు భూపాలపల్లి నుంచి హనుమకొండ వైపు వెళ్తూ పరకాల బస్టాండ్‌లోకి మలుపు తీసుకుంది. రోడ్డు మలుపు వద్ద ఇరుకుగా ఉండటం, తోపుడు బండ్లు ఉండటంతో డ్రైవర్‌కు రోడ్డుపై నడుస్తున్న రాధమ్మ(70) కనిపించలేదు. బస్సు మలుపు తిరుగుతున్న వేగంలో ఆమెను బస్సు ఢకొీట్టింది. దాంతో బస్సు ముందు టైర్‌ వృద్ధురాలుపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పాల్సావ్‌పల్లికి చెందిన తోట రాధమ్మగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -