నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) దక్షిణ భారతదేశ కోఆర్డినేటర్‌గా సయ్యద్ షౌకత్‌అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐపీటీఎఫ్ జాతీయ అధ్యక్షులు సుశీల్‌కుమార్ పాండే బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. మూడేండ్లపాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. దక్షిణ భారతదేశ కోఆర్డినేటర్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలతోపాటు పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాన్ని షౌకత్‌అలీ పర్యవేక్షిస్తారు. సుశీల్‌కుమార్ పాండేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాననీ, దక్షిణ భారత దేశానికి చెందిన శాఖలను బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లోని అధ్యక్ష, కార్యదర్శులు తనకు సహాయ, సహకారాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఏఐపీటీఎఫ్ దక్షిణాది కోఆర్డినేటర్‌గా షౌకత్‌అలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



