యుపిలో రెచ్చిపోతున్న హిందూ రక్షా దళ్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంలో కాషాయమూకలు రెచ్చిపోతున్నాయి. తాజాగా హిందూ రక్షా దళ్ ఘజియాబాద్‌లో ఇంటింటికీ కత్తులను పంపిణీ చేసింది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లో హిందూ రక్షా దళ్ అధ్యక్షురాలు పింకీ చౌదరి సంస్థ సభ్యుల ద్వారా ఇంటింటికీ కత్తులను పంపిణీ చేశారు. వారు కత్తులను అందిస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తీవ్ర విమర్శలు వెల్లు వెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేసి, 10మందిని అరెస్ట్ చేశారు. 46 మందిపై బిఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ గార్డెన్ కుమార్ తెలిపారు.
హింసాత్మక ఆలోచనల నుంచి ఆయుధాల వరకు ప్రతిదానిని ప్రజల ఇళ్లకు పంపిణీ చేసి, దేశ ఐక్యత, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్న శత్రువులపై చర్యలు తీసుకునేవారు ఎవరైనా ఉన్నారా అని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. హింస అనాగరిక వ్యక్తులను, బలహీనపరిచే శక్తులను కూడా సూచి స్తుందని ఎక్స్‌లో పేర్కొన్నారు. మతసామరస్యానికి భంగం కలిగించడానికి, మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేయడానికి పశ్చిమ యుపి అంతటా మితవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి షాన్వాజ్ ఆలం మర్శించారు.
ఇంటింటికీ కత్తుల పంపిణీ
- Advertisement -
- Advertisement -



