Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎం.రాజశేఖర్‌ రెడ్డి

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎం.రాజశేఖర్‌ రెడ్డి

- Advertisement -

– రాష్ట్ర కార్యదర్శులుగా మరో నలుగురు ఎన్నిక
– ప్రధాన సంపాదకులుగా కె జంగయ్య నియామకం
– ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై పలు తీర్మానాల ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎం.రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులుగా పి.నాగేశ్వర రావు, పి.వెంకటేశం, ఎన్‌.సోంబాబు, సిహెచ్‌.విశాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆఫీసు బేరర్లలో ఏర్పడిన ఖాళీలకు జనగామలో జరిగిన రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలలో నిర్వహించిన ఎన్నికల్లో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌ పత్రిక ప్రధాన సంపాదకులుగా రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కె.జంగయ్య నియమితులయ్యారు. అంతకుముందు సమావేశంలో రేషనలైజేషన్‌ జీవోను సవరించాలనీ, ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించాలనీ, అన్ని పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించాలనీ, డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఒ తదితర పర్యవేక్షణ అధికారులను నియమించాలనీ, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని తదితర విద్యా రంగ తీర్మానాలను ఆమోదించారు. రిటైర్మెంట్‌ వయస్సును పెంచే ప్రతిపాదనను విరమించుకోవాలనీ, ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.పది వేల కోట్లు అప్పు తెచ్చైనా సరే వారికి బెనిఫిట్స్‌ ఏకమొత్తంగా చెల్లించాలనీ, పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించి 1.07.2023 నుంచి అమలు చేయాలనీ, సీనియర్‌ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయించాలని కూడా సమావేశంలో తీర్మానించారు. గురుకులాల టైమ్‌ టేబుల్‌ సవరించాలనీ, మోడల్‌ స్కూల్స్‌, గురుకులాల సిబ్బందికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలనీ, కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని తదితర తీర్మానాలను రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమోదించినట్టు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -