Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం రేవంత్‌రెడ్డి ఊహల నగరం ఫోర్త్‌సిటీ

సీఎం రేవంత్‌రెడ్డి ఊహల నగరం ఫోర్త్‌సిటీ

- Advertisement -

– హైదరాబాద్‌ అంటే ఆయనకు ద్వేషం
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెపి వివేకానంద
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌ నగరమంటే చిన్నచూపు, ద్వేషమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెపి వివేకానంద అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ను మొదటి నుంచి చెత్తనగరంగా చూస్తున్నారని అన్నారు. ఆయన ఊహల నగరం ఫోర్త్‌సిటీ అని చెప్పారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు మెట్రోను రద్దు చేశారని వివరించారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఎక్కడపడితే అక్కడ కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. హైదరాబాద్‌లో కాలుష్యం లేకుండా ఫార్మాసిటీని కట్టాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక హైదరాబాద్‌ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని చెప్పారు. మహేశ్వరం, మేడ్చల్‌, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గాల్లోని గ్రామాలను కార్పొరేషన్‌లో కలిపి అక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. పేరుకే ప్రజాపాలన చేసేది రాజరిక పాలన అని విమర్శించారు. ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోకుండా 27 మున్సిపాల్టీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారని చెప్పారు. మంత్రులు, అధికారులు, మేయర్‌కు తెలియకుండా 300 వార్డులను చేశారని వివరించారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ పాలన చేస్తున్నారని అన్నారు. ఆయన నిర్ణయాలను కాంగ్రెస్‌ నాయకులు, కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజరు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని వివరించారు. ఇంగ్లాండ్‌లో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 160 రోజులు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ గతేడాది 16 రోజులే నడిచిందన్నారు. జీరో అవర్‌ జీరో ఆన్సర్‌గా మారిందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -