- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో చిట్టీ డబ్బుల వ్యవహారంలో దారుణం చోటుచేసుకుంది. రూ. 12 వేల చిట్టీ డబ్బులు అడిగినందుకు దాసోజు శ్రీను, దాసోజు వేణు అనే తండ్రీకొడుకులు కలిసి కొలగాని అంజయ్య (53) అనే వ్యక్తిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన అంజయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లక్ష రూపాయల చిట్టీ విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అంజయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



