-ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్…
నవతెలంగాణ- రాయపోల్
రాష్ట్ర ప్రజలకు ముందుగా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని ఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలు స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సవాలతో జరుపుకోవాలని,వినోదం విషాదంగా మారకుండా వేడుకలు నిర్వహించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని,మద్యం సేవించి అతివేగంగా జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించద్దన్నారు. రాత్రి 12:00 గంటల తరువాత రోడ్ల పై కేకులు కట్ చేస్తూ, డిజేలు పెట్టి డాన్సులు చేస్తూ,బహిరంగంగా మద్యం సేవించరాదన్నారు.నూతన సంవత్సరం సందర్భంగ అతి ఉత్సాహం చూపిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆస్తులని ధ్వంసం చేయడం సరైనది కాదన్నారు. సోషల్ మీడియాలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపే క్రమములో అసభ్య సందేశాలు, అసభ్య ఫోటోలు పంపించిన, అసభ్య ఆడియోలు పంపిస్తే వారిపై చట్ట రీత్యా నేరమన్నారు. ఈ నూతన సంత్సర వేడుకలలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలతో కలసి కుటుంబ సమేతముగా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. క్షణికావేశంలో తాత్కాలిగా ఆనందం కోసం చేసిన చర్యల వలన ప్రమాదము జరిగిన అది మీ కుటుంబంలో తీరని దుఃఖం మిగులుస్తుందన్నారు. ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దు.ఒకరోజు ఆనందానికి భవిష్యత్తు అందాకారం చేసుకోవద్దు. ప్రజలందరూ నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



