Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం

కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
నూతన సంవత్సరం తమ జీవితాల్లో వెలుగులు తేవాలని కోరుతూ ప్రజలు కోటి ఆశలతో 2026కు స్వాగతం పలికారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. యువత పటాకులు కాల్చి, కేకులు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో రాత్రి 11 గంటల వరకు రోడ్లపై రద్దీ కొనసాగింది. ఆయా దుకాణాల వారు కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో షాపులను అలంకరించారు. ఎక్కడా చూసినా హ్యాపీన్యూఇయర్ సందడే కంనిపించింది.పిల్లలు మొదలు పెద్దల వరకు అంతటా కేక్స్ కట్ చేసి 2026 నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. యువత బైక్స్ పై తిరుగుతూ హ్యాపీ న్యూయర్ అంటూ ఆనందాలను పంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఒక్కరినొక్కరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -