నవతెలంగాణ – మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ గా నియామకం అయినా శాసన మండలి సభ్యులు, మాజీ డీసీసీ అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ ను బంజారా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ లో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్, ఎంఎల్సి శంకర్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గిరిజన తెగలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ముఖ్యం బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను శాసన మండలిలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీనిచ్చారు. అనంతరం 2026 సంవత్సరం కేక్ ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సైదా నాయక్, లక్ష్మణ్ నాయక్, రవి నాయక్, వెంకన్న నాయక్, మాజీ మండల విద్యాధికారి బాలాజీ నాయక్, ప్రధానోపాధ్యాయులు ధర్మ నాయక్, గోపి నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, మక్లా నాయక్, నెహ్రూ నాయక్, శ్రీనివాస్ రావు నయ, కృష్ణకాంత్, సైదులు తదితరులు పాల్గొన్నారు.


