ఎంవిఐ నాగలక్ష్మి
నవతెలంగాణ – కంఠేశ్వర్
జీవితంలో ఏదైనా సాధించాలంటే ప్రాణాలతో ఉండడం అవసరమని దానికోసం రవాణా భద్రతా సూత్రాలను పాటించాలని కామారెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి అన్నారు. గురువారం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఆమె తన బృందంతో సారంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. 18 సంవత్సరాలలోపు మైనర్లు ద్విచక్ర వాహనాలను నడపరాదని, 18 సంవత్సరాల తర్వాత లైసెన్స్ పొందిన తర్వాతనే నడపాలని లేనిపక్షంలో శిక్షార్హులవుతారని ఆమె తెలిపారు.
పరిమితికి మించి పాసింజర్ లో నింపుకుంటున్న ఆటోలో ప్రయాణించవద్దని, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సేఫ్టీ బెల్ట్ ధరించాలని లేనిపక్షంలో ఏం జరుగుతుందో వివిధ ఉదంతాలతో వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇన్చార్జ్ హెడ్మాస్టర్ లలిత మాట్లాడుతూ.. అవగాహన లేక తల్లిదండ్రులు మైనర్లు అయిన తమ పిల్లలకు బండ్లు ఇస్తారని పిల్లలే వారిని చైతన్యపరిచి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు నడపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ, మొహమ్మద్ జావిద్, డాక్టర్ గంగాధర్, ఘనపురం దేవేందర్, స్వరూపారాణి, శ్రీలత, సుజాత, సునంద, అనిత. కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.



