- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్ నిజామాబాదు ట్రాఫిక్ విభాగం లో తనిఖీ లు 130 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు.
- Advertisement -



