Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డుల ముసాయిదా జాబితా విడుదల 

మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డుల ముసాయిదా జాబితా విడుదల 

- Advertisement -

జాబితాలో విడుదల చేసిన కమిషనర్ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ పట్టణంలో 48 వార్డుల గాను వార్డుల వారిగా ముసాయిదా జాబితాను గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విడుదల చేశారు. పట్టణంలో 48 వార్డులో 93020 ఓటర్లు ముసాయిదా జాబితా ప్రకారం ఉన్నారని వీరిలో పురుషులు 45,128, మహిళలు 47,878,ఇతరులు 14 mandi ఉన్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల ఐదున ఆయా రాజకీయ పార్టీలతో అవగాహన సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ముసాయిదా జాబితాను మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామన్నారు.

గుర్తుకు పొందిన రాజకీయ పార్టీల వారికి సైతం అందిస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను రెవెన్యూ అధికారులు పరిశీలించి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 10న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. గతేడాది అక్టోబర్ 10వ తేదీన కటాఫ్ గా పరిగణించి ఓటర్ జాబితాలను రూపొందించారన్నారు పట్టణంలో పోలింగ్ బూత్లను పరిశీలిస్తున్నామని 800 మందికి ఒక పోలింగ్ బూత్ ఉండాలని ఎన్నికలు కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అవసరమైన చోట అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిఈ వెంకన్న మేనేజర్ జ్ఞానేశ్వరి టీపీఎస్ అంజయ్య ఏఈ నవీన్ సీనియర్ అసిస్టెంట్ శంకర్ సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ పిఆర్పి బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -