Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ విప్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు 

ప్రభుత్వ విప్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
నూతన సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా ఆలేరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ప్రభుత్వ విప్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి ఫ్లవర్ బొకే ని అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ .. నూతన సంవత్సరంలో ఆలేరు ప్రజలందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను అని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అఖిలపక్ష నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉదయాన్నే చల్లని చలిలో ఆలేరు ఎండి సలీం మాజీ సర్పంచ్ చింతకింది మురళి బిజిన భాస్కర్ దూడల రాజు గౌడ్ తనను కలవడానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆలేర్ పట్టణంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -