నవతెలంగాణ – మద్నూర్
జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బిబి పాటిల్ ఎంపిగా ఉన్నప్పుడు మద్నూర్ ప్రభుత్వాస్పత్రికి భారీ అంబులెన్స్ ను తెచ్చి పెట్టారు. అలాంటి అంబులెన్స్ ద్వారా అత్యవసర రోగులకు ఉపయోగపడుతుందని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీబీ పాటిల్ మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి దాదాపు రూ.22 లక్షల నిధులతో సౌకర్యాలు కలిగిన అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. అలాంటి వాహనం మద్నూర్ ప్రభుత్వాస్పత్రిలో నిరుపయోగంగానే ఉండిపోయింది. నిలబెట్టిన చోటే తుప్పుపట్టే విధంగా మారింది. ఈ వాహనం నిరుపయోగంగా ఉండడానికి ముఖ్య కారణం దానికి డ్రైవర్ లేకపోవడమే. ఉన్న డ్రైవర్ను జిల్లా కేంద్రానికి తరలించడం, ఈ వాహనానికి ప్రత్యామ్నాయ డ్రైవర్ ను నియమించకపోవడమే నని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అంబులెన్స్ ను వాడుకలోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.
నిరుపయోగంగా అంబులెన్స్
- Advertisement -
- Advertisement -


