Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

మండలంలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

- Advertisement -

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస అన్నారు.గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎస్ టీయుటిఎస్  ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్, డైరీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ముందుండే ఎస్ టీయుటిఎస్  ఉపాధ్యాయ సంఘం సేవలను అడిగి తెలుసుకొని అభినందించారు. నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులంతా సమిష్టిగా పనిచేసి మండలంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు బుస్స కృష్ణ కుమార్, శ్రీనివాసమూర్తి, సి అర్ పి అంజయ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -