నవతెలంగాణ – సదాశివపేట
సాయి గణేష్ షాపింగ్ మాల్ లక్కీ డ్రాలో టాటా టియాగో కారు గెలుపు గురువారం సదాశివపేట పట్టణంలోని సాయి గణేష్ క్లాత్ మర్చంట్ ఆధ్వర్యంలో గత ఏడాది సెప్టెంబర్ 29, 2025న ఘనంగా ప్రారంభమైన సాయి గణేష్ షాపింగ్ మాల్ వినియోగదారుల ఆదరణతో ముందుకు సాగుతోంది. మాల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాని రావులపల్లి మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలు విశేష స్పందనను పొందాయి.
ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో ఒక వినియోగదారుకు స్కూటీని బహుమతిగా అందజేశారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జనవరి 1, 2026న నిర్వహించిన మరో లక్కీ డ్రాలో ఆరూరు గ్రామానికి చెందిన మన్నే రామకృష్ణకు టాటా టియాగో కారు బహుమతిగా లభించింది. విజేతకు బహుమతి అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై మన్నే రామకృష్ణకు కారును అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు పాల్గొని యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా విజేత మన్నే రామకృష్ణ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబం సాయి గణేష్ క్లాత్ మర్చంట్‌లోనే బట్టలు కొనుగోలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. నాణ్యత, నమ్మకంతో ఇదే షాపుకు అలవాటు పడిపోయామని, అలాంటి షాపులో కొనుగోలు చేసినందుకు అదృష్టవశాత్తు ఇంత పెద్ద బహుమతి లభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సాయి గణేష్ క్లాత్ మర్చంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా వినియోగదారులకు ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లు, లక్కీ డ్రాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలతో పాటు విశ్వసనీయ సేవలు అందించడమే లక్ష్యంగా సాయి గణేష్ షాపింగ్ మాల్ కొనసాగుతుందని యాజమాన్యం ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ లక్కీ డ్రాలు వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీర్లపల్లి వెంకటేశం, నాగరాజుగౌడ్ మాజీ కౌన్సిలర్, సాయి గణేష్ యాజమాన్యం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



