Thursday, January 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన ఆదిలాబాద్ అధికారులు

నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన ఆదిలాబాద్ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
నవతెలంగాణ పత్రిక ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ను, డైరీని, కోర్టు క్యాలెండర్ ను అధికారులు గురువారం లాంఛనంగా ఆవిష్కరించారు. ముందుగా జిల్లా జడ్జి ప్రభాకర్ రావ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జడ్జితో క్యాలెండర్, డైరీని అవిష్కరింపజేశారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ను వారి కార్యాలయాల్లో వేర్వేరుగా కలిసి క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ రీజనల్ మేనేజర్ కె. నాందేవ్, డెస్క్ ఇంఛార్జి ఆర్.దత్తాత్రి, ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గాజరి మహేష్, డివిజన్ ఇంఛార్జి ఉష్కం సురేష్, రిపోర్టర్లు గాజరి శ్రీకాంత్, రాజేశ్వర్, వంశీ, ప్రశాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -