నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని నైనాల గ్రామాన్ని మహబూబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్ నిధులతో పూర్తి స్థయిలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాయిని శ్రీపాల్ రెడ్డి, జాగిరి యాకసైయలు, పెరుమాండ్ల జగన్ తెలిపారు. గురువారం ఎంపీ నిధులు 15 లక్షలతో సిసి రోడ్లు 3,50,000 లైట్స్ ఆ గ్రామ సర్పంచ్ యాసం సంధ్యా రమేష్, ఉప సర్పంచ్ పెరుమళ్ళ ఉపేందర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత ఎంపీ పోరిక బలరాం నాయక్ సొంత నిధులు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులను గ్రామంలో ప్రారంభించామని అన్నారు.
గ్రామంలో ఏ విధులు కూడా బురదమయం లేకుండా చూడడమే లక్ష్యమని అన్నారు. అంతేకాకుండా గ్రామ ప్రజలు చీకటిలో ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతో సోలార్ లైట్లు తన ఎంపీ ల్యాండ్ నిధులు రూ. 3 లక్షల రూ.50 వేలు చీకటిమయం లేకుండా లైట్లు ఏర్పాటు చేశామని అన్నారు. రానున్న రోజుల్లో అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ కి గ్రామస్తులు హర్ష వ్యక్తం ప్రకటించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాసం యాకయ్య,పెరమండ్ల జగన్ బాబు, కె యాకయ్య, వార్డ్ మెంబర్స్…బొడ్డు విజయ్, ఆకుల జ్యోతి, మల్లేష్, భానాల యాకయ్య, శివారీల కొమరయ్య, మంద రవి, బొడ్డు సురేష్, పాల్గొన్నారు.



