Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభ్యంతరాలుంటే ఈనెల 9 లోగా తెలపాలి: కమిషనర్

అభ్యంతరాలుంటే ఈనెల 9 లోగా తెలపాలి: కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
త్వరలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా దుబ్బాకలోని మున్సిపల్ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఏర్పాటు చేసిన ఓటర్ లిస్టులో పొరపాట్లు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9 లోగా లిఖితపూర్వకంగా తెలపాలని మున్సిపల్ కమిషనర్ కే. రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఓటర్ల వివరాలతో కూడిన పూర్తి జాబితాను దుబ్బాకలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ జనాభా – 27496, ఓటర్లు -21346, ఇందులో పురుషులు- 10224, స్త్రీలు – 11118 మంది ఉన్నారు. వార్డులు- 20, పోలింగ్ స్టేషన్లు – 41. మేనేజర్ శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ అనిల్ రెడ్డి, వర్క్ ఇన్ స్పెక్టర్ బీ. ప్రవీణ్, శానిటరీ ఇన్ స్పెక్టర్ దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -