Thursday, January 1, 2026
E-PAPER
Homeక్రైమ్మద్యం మత్తులో చెరువులో పడి వ్యక్తి మృతి

మద్యం మత్తులో చెరువులో పడి వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మద్యం మత్తులో ఊర చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వన్నెల్ బి గ్రామానికి చెందిన కోటగిరి దేవేందర్ (44) బుధవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరి కళ్ళు దుకాణం వద్ద మద్యం సేవించాడు. అక్కడ మద్యం మత్తులో కళ్ళు దుకాణం పక్కన ఉన్న ఊర చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయాడని మృతుని తమ్ముడు కోటగిరి శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ బి ఠాకూర్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -