– కమీషనర్ బి.నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ మున్సిపాలిటీ చట్టం, 2019 లోని సెక్షన్ 11 మరియు 12 ప్రకారము, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్’ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు సంబంధిచిన ఓటర్ల జాబితా వార్డు వారిగా గురువారం విడుదల చేసినట్లు కమీషనర్ బి.నాగరాజు ప్రకటించారు. 1వ తేదీ అక్టోబర్ 2025 అర్హత తేదీ గా సిద్దం చేసి ప్రచురించడం జరిగిందని ఆయన అన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా అశ్వారావుపేట మున్సిపల్ కార్యాలయంలో, కార్యాలయ సమయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.
దావాలు, అభ్యంతరాలు ఉంటే ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను మున్సిపల్ కమిషనర్ సమర్పించాలని, అన్ని దావాలు మరియు అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, ఆనంతరం తుది ఓటర్ల జాబితాను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ప్రచురించబడుతుంది అని తెలిపారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం “22” వార్డులకు సంబందించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మహిళలు 8762, పురుషులు 8084,ఇతరులు 4 మొత్తం 16850 ఓటర్లు గా ప్రకటించారు.



