ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
రెడ్డి సంక్షేమ సంఘం సమాజంలో అన్ని వర్గాల వారికి సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణం చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మిర్యాలగూడలో భవన నిర్మాణం చేపట్టటం ఆనందంగా ఉన్నదని తెలిపారు. ఈ భవనంలో అన్ని వర్గాల వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు చేపట్టాలని సూచించారు.
ముఖ్యంగా రైతులకు ఆధునిక వ్యవసాయం పైన శిక్షణ ఇవ్వాలని, మహిళలకు స్వయం ఉపాధి పైన శిక్షణ ఇచ్చి చేయూత ఇవ్వాలని సూచించారు. సంక్షేమ సంఘం భవనం పూర్తి చేసేందుకు ధనవంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శాగా జలంధర్ రెడ్డి శేఖర్ రెడ్డి రుణాల్ రెడ్డి ముదిరెడ్డి నర్సిరెడ్డి మన్యం లింగారెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కంచర్ల అనంతరెడ్డి, నాయకులు పాప చెన్నారెడ్డి, మన్నెం బుచ్చిరెడ్డి, నామిరెడ్డి నరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులున్నారు.



