- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన క్రాస్ కంట్రీ జిల్లా స్థాయి పోటీల్లో మండలంలోని ఎడ్లపల్లి మోడల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు తెలిపారు. అజ్మీరా భవాని, ప్రసాద్, దాసరి రాజ్ కుమార్ క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. జనవరి 2వ తేదీన రంగారెడ్డి జిల్లాలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి క్లాస్ కంట్రీ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. సెలెక్ట్ అయిన క్రీడాకారులను, ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబు, కోచ్ హాట్కర్ రఘువీర్ లను అభినందించారు.
- Advertisement -



