నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ముందస్తు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు సంవత్సరాలలో ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. జనవరి ఫస్ట్ నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో విద్యార్థిని, విద్యార్థులు గతంలో చేసినటువంటి తప్పులను మళ్లీ చేయకుండా నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలు కొత్త నడవడిక, విద్యపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో న్యూఇయర్ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



