సుహాస్ యూనిక్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో ఆయన ‘హే భగవాన్!’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఇది వారి ప్రొడక్షన్ నెంబర్ 2. రైటర్ పద్మభూషణ్ ఫేం షణ్ముక ప్రశాంత్ ఈ కథను రాశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో సస్పెన్స్, కామెడీ అదిరిపోయింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శివాని నగరం హీరోయిన్‌గా నటిస్తున్నారు. నరేష్ వికె, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సుహాస్ ఎన్నుకునే స్క్రిప్ట్‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అలాగే ఆయన పోషించే పాత్రలు సైతం అదే రీతిలో ఉంటూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.
ఈ సినిమా, ఇందులోని ఆయన పాత్ర ఈ కోవలోనే ఉంటుంది. మరో వినూత్న కథతో ఆయన ఈసారి ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. మా దర్శకుడు గోపి అచ్చర ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఏకధాటిగా జరిపిన షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా బ్యానర్‌కు ఈ సినిమాతో మరింత మంచిపేరు వస్తుందని ఆశిస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం: గోపీ అచ్చర, నిర్మాత: బి నరేంద్ర రెడ్డి, డీవోపీ: మహి రెడ్డి పండుగల, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: విప్లవ్ నిషాదం, ఆర్ట్ డైరెక్టర్: ఎ రామ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమణారెడ్డి, రచయిత: షణ్ముఖ ప్రశాంత్.
‘హే భగవాన్!’ షూటింగ్ పూర్తి
- Advertisement -
- Advertisement -



