జడల్‌గా ఓ వినూత్న పాత్రలో నాని నటిస్తున్న చిత్రం ‘ది పారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను మరింత రెట్టింపు చేస్తూ నూతన సంవత్సరం సందర్భంగా మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని జడల్ పాత్రలో పవర్‌ఫుల్‌గా, తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఓ కొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్ సినిమాలో కీలకమైన జైలు ఫైట్ సీన్‌కి సంబంధించినది. ఫారిన్ ఫైటర్లతో జరిగే హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ కూడా. కథను కీలక మలుపు తిప్పే ప్రధాన ఘట్టాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. ‘దసరా’లో పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలోనూ ఆయన మార్క్‌ని చూపించబోతున్నారు. ఈ సినిమా మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సి.హెచ్.సాయి, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఎడిటింగ్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్‌కొల్లా.
ఆ అంచనాలకు మించి..
- Advertisement -
- Advertisement -



