హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శక, నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని అమత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ అందిస్తూ, మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సమ్మర్‌లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి ఆర్ట్ – భాస్కర్ ముదావత్, ఎడిటర్ – సంతోష్ నాయుడు, డీవోపీ – విశ్వాస్ డేనియల్, లిరిక్స్ – అనంత్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల, లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక, కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని, స్టోరీ – సాయి రాజేశ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి.



