Friday, January 2, 2026
E-PAPER
Homeసినిమానవ్విస్తూనే భయపెట్టే 'రుక్మిణి'

నవ్విస్తూనే భయపెట్టే ‘రుక్మిణి’

- Advertisement -

నిరంజన్‌, గ్రీష్మ నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం హీరో, హీరోయిన్స్‌గా జి సినిమా బ్యానర్‌ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా ‘రుక్మిణి’. నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హర్రర్‌, కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్‌ కానుకగా గురువారం హీరో రాజేంద్రప్రసాద్‌ ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’గంగాధర్‌ నాతో ఎన్నో ఏళ్లు పనిచేశాడు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ వంటి ఎన్నో హిట్‌ మూవీస్‌కు మాతో వర్క్‌ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మాతగా ఈ సినిమా చేయడం హ్యాపీగా ఉంది’ అని అన్నారు.

‘హర్రర్‌ కామెడీ జోనర్‌లో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. సంక్రాంతికి టీజర్‌తో మీ ముందుకు వస్తాం’ అని హీరో నిరంజన్‌ చెప్పారు. హీరోయిన్‌ గ్రీష్మ నేత్రికా మాట్లాడుతూ,”మళ్లీశ్వరి’ మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నన్ను మీరంతా ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాతో హీరోయిన్‌గా మీ ముందుకు వస్తున్నాను’ అని తెలిపారు. నిర్మాత కట్టా గంగాధర్‌ రావు మాట్లాడుతూ,’మంచి కంటెంట్‌, కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను మీరంతా సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ‘సరికొత్త హర్రర్‌ కామెడీ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని డైరెక్టర్‌ సింహాచలం గుడుపూరి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -