- Advertisement -
వైవిధ్యమైన కథలు, భిన్న కాంబినేషన్లతో నూతన సంవత్సరంలో మరింత సందడి చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా తమ కథలు, తమ నాయకానాయికల పాత్రల తీరుని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్స్‌ని రిలీజ్ చేయడంతోపాటు అప్‌డేట్స్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ పవన్‌కళ్యాణ్ ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. దీన్ని జైత్ర రామ్ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్ళూరి భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
- Advertisement -



