న్యూ ఇయర్‌లో రాష్ట్ర ఖజానాకు కిక్కు
7.78 లక్షల కేసుల బీరు అమ్మకాలు
ఆరోగ్యాన్ని లెక్కచేయని మందుబాబులు
నవతెలంగాణ – హైదరాబాద్
మద్యం తాగితే ఆరోగ్యానికి చేటు అంటున్నా మందుబాబులు అస్సలు ఆగటం లేదు. పైగా న్యూ ఇయర్ సందర్భంగా తాగుతున్నామంటూ తెగ తాగేశారు. దీంతో రాష్ట్రంలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అబ్కారీ శాఖ అధికారులు లెక్కగట్టారు. 2024 డిసెంబర్ నెల చివరి మూడు రోజుల్లో రూ.736 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా… 2025 డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.980 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు అబ్కారీ శాఖ చెబుతోంది. నూతన మద్యం విధానంలో భాగంగా కొత్తగా లైసెన్స్‌లు పొందిన దుకాణదారులు డిసెంబర్ నుంచి మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 3,620 మద్యం దుకాణాలు, దాదాపు 1,100 బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు కలిసి డిసెంబర్ నెలలో రూ.4,920 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి కొనుగోలు చేశారు. డిసెంబర్ 25 నుంచి 31 వరకు మద్యం విక్రయాల విలువ రూ.1350 కోట్లకుపైగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ 29న రూ.280 కోట్లు, 30న రూ.380 కోట్లు, 31న రూ.315 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. మొత్తం 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.
రూ.వెయ్యి కోట్ల మద్యం తాగేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



