Friday, January 2, 2026
E-PAPER
Homeబీజినెస్వెనక్కి తగ్గిన లోక్‌పాల్‌

వెనక్కి తగ్గిన లోక్‌పాల్‌

- Advertisement -

బీఎండబ్ల్యూ కార్ల టెండర్‌ రద్దు
విమర్శల ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ : బీఎండబ్ల్యూ కార్ల టెండర్‌ విషయంలో లోక్‌పాల్‌ వెనక్కి తగ్గింది. ఒక్కొక్కటి రూ.70 లక్షల విలువైన ఏడు బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుకు టెండర్‌ ఆహ్వానించడంపై విమర్శలు వ్యక్తమైన
సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌పాల్‌ ఆ కార్ల టెండర్‌ను రద్దు చేసింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను వెల్లడించాయి. లోక్‌పాల్‌ చైర్మెన్‌, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఖాన్విల్కర్‌ సహా ఏడుగురు జ్యుడీషియల్‌, నాన్‌-జ్యుడీషియల్‌ సభ్యుల కోసం కొన్ని నెలల క్రితం లోక్‌పాల్‌ బీఎండబ్ల్యూ కార్ల టెండర్‌ను ఆహ్వానించింది. అయితే ఎంపికైన విక్రయదారు బీఎండబ్ల్యూ కార్లను నడిపే విధానంపై ఏడు రోజులు తమ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని, ఈ ఖర్చును కూడా వారే భరించాలని షరతు విధించింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వంలో లోక్‌పాల్‌ పనితీరేంటో తేలిపోయిందని, అవినీతిపై పోరాడాల్సింది పోయి విలాసవంతమైన కార్ల కొనుగోలుకు లోక్‌పాల్‌ సిద్ధమైందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -