డీవైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి హిమాఘ్నరాజ్ భట్టాచార్య
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రతినిధి
నిరుద్యోగం, యువత సమస్యలపై సీఐటీయూతో ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని డీవైఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాఘ్నరాజ్ భట్టాచార్య ప్రకటించారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలో ఆయన సౌహార్ధ సందేశం ఇచ్చారు. మోడీ సర్కార్ హయంలో దేశంలో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు. దాని నుంచి తప్పించుకునేందుకు యువత మెదళ్లను మతోన్మాద భావజాలంతో నింపాలని ప్రయత్నం తీవ్రతరమైందనీ, దాన్ని తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. నేటి యువతే, రేపటి కార్మికులంటూ కార్మికులు, యువత ఐక్య పోరాట ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మోడీ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి యువతే లక్ష్యంగా దాడి తీవ్రతర మైందనీ, దీన్ని డీవైఎఫ్‌ఐ ప్రతిఘటి స్తోందని అన్నారు. సీఐటీయూ పోరా టాల్లో డీవైఎఫ్‌ఐ భాగ స్వామ్య మవుతున్నదని చెప్పారు. యువత, కార్మిక ఐక్య పోరాటాల బలోపేతానికి ఈ మహాసభ వేదిక కావాలని ఆకాంక్షించారు.
విద్యార్థి, కార్మిక ఐక్యతను బలోపేతం చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
విద్యార్ధి కార్మిక ఐక్యతను బలోపేతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ ఎం. సాజీ పిలుపునిచ్చారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలో బుధవారం ఆయన సౌహార్థ సందేశం ఇచ్చారు. ఈ దోపిడీ వ్యవస్థను నిర్మూలించడానికి సీఐ టీయూతో తాము కలిసి పనిచేస్తా మన్నారు. కార్మికవర్గానికి తమ సంఘీ భావం పెంపొందిస్తామన్నారు. మోడీ పాలనలో కార్పొరేట్, మతపర బంధం ప్రజాస్వామ్య ప్రక్రియలపై దాడిచేస్తోందని విమర్శించారు. పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, స్వతంత్ర సంస్థలపై ఈ రకమైనదాడి స్పష్టంగా కనిపిస్తోందన్నారు.కొత్త కార్మిక విధానం సులభతరం చేయడానికి కేంద్రం నూతన విద్యావిధానాన్ని (ఎస్‌ఐపి) ప్రవేశపెట్టిందన్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల ఆకాంక్షను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రధాన మోడీ బహిరంగ సభ ల్లో ప్రసంగిస్తున్నప్పుడల్లా దేశం ప్రకాశిస్తుందని చెప్తున్నప్పటికీ, దేశ మొత్తం ప్రభుత్వ విధానాల కారణంగా ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విద్యపై మోడీ యుద్ధం ప్రకటించారనీ, ఫీజుల పెంపు, స్కాలర్ షిప్పుల్లో కోత, అందుకు నిదర్శనమంటూ ఉదహరించారు .
నిరుద్యోగంపై ఐక్యపోరాటం
- Advertisement -
- Advertisement -



