Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్క్‌ఫెడ్‌ అధికారులను నిర్బంధించిన రైతులు

మార్క్‌ఫెడ్‌ అధికారులను నిర్బంధించిన రైతులు

- Advertisement -

సోయా పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్‌

నవతెలంగాణ-బోథ్‌
ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో నిల్వ ఉన్న సోయా పంటను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ డీఎం ప్రవీణ్‌రెడ్డి, డీసీఓ మోహన్‌ను గురువారం రైతులు కార్యాలయంలో నిర్బంధించారు. సోయా పంటను పరిశీలించేందుకు వచ్చిన అధికారులను రైతులు నిలదీశారు. సోయాను నెలల తరబడి మార్కెట్‌ యార్డులో లారీల్లో లోడ్‌ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను కార్యాలయంలో నిర్బంధించారు.

పోలీసులు జోక్యం చేసుకొని సమస్యలపై అధికారులతో మాట్లాడించారు. ఈ సందర్భం గా రైతులు మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే, సంచులు కుట్టేందుకు దారాలు సైతం రైతులే కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తోందని, హమాలీలకు ప్రభుత్వం కూలిరేటు చెల్లిస్తున్నప్పటికీ రైతుల వద్ద క్వింటాలుకు రూ.45 అధికంగా వసూలు చేస్తున్నారని వాపోయారు. వాటిపై విచారణ జరిపి స్తామని అధికారులు అన్నారు. అనంతరం మార్కెట్‌ అధికారులు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సోయా పంట కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -