Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంన్యూ ఇయర్‌ వేళ ..మూడు కమిషనరేట్లలో 2731 మందిపై కేసులు

న్యూ ఇయర్‌ వేళ ..మూడు కమిషనరేట్లలో 2731 మందిపై కేసులు

- Advertisement -

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,198 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు
అత్యధికంగా 1,042 మంది బైక్‌ రైడర్లే..
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ఉక్కుపాదం కొనసాగుతుంది : ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ

నవతెలంగాణ-సిటీబ్యూరో
నూతన సంవత్సర (2026) వేడుకల సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఒక్క రోజు వ్యవధిలోనే మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 2731 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌లో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలను నివారించే లక్ష్యంతో డిసెంబర్‌ 31 సాయంత్రం 7 గంటల నుంచి గురువారం(జనవరి 1వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 1,198 మందిపై కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి పట్టుబడిన వారిలో ద్విచక్ర వాహనదారులే అత్యధికంగా ఉన్నారు. మొత్తం నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి: ద్విచక్ర వాహనదారులు 1,042 మంది, ఆటోలు/ త్రీ వీలర్స్‌ 51 మంది, కార్లు, ఇతర వాహనాలు 105 మంది ఉండగా.. ఆల్కహాల్‌ మోతాదు(బీఏసీ లెవల్స్‌) వారిగా కేసుల వివరాలు చూస్తే.. 30 – 50 పాయింట్లు: 175 కేసులు, 51 – 100 పాయింట్లు: 468 కేసులు (అత్యధికం), 101 – 150 పాయింట్లు: 293 కేసులు, 151 – 200 పాయింట్లు: 163 కేసులు, 201 – 250 పాయింట్లు: 51 కేసులు, 251 – 300 పాయింట్లు: 31 కేసులు, 300 పాయింట్ల కంటే ఎక్కువ: 17 కేసులు నమోదయ్యాయి.

పౌరులు తమ గమ్యస్థానాలకు సురక్షితం గా చేరుకోవాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకూ డదన్న ఉద్దేశంతోనే ఈ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చినట్టు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు బాధ్యతాయుతంగా జరుపు కోవడానికి ఈ చర్యలు దోహద పడినట్టు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల ‘జీరో టోలరెన్స్‌’ విధానాన్ని పాటిస్తామని, భవిష్యత్‌లోనూ ఈ స్పెషల్‌ డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు. సైబరాబాద్‌లో 928 మంది, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 605 మంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -