ముఖ్యమంత్రికి ఎస్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ సర్వీసు రూల్స్‌ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎస్టీయూటీఎస్ కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితో కలిసి ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్ ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ సంఘం నూతన సంవత్సర డైరీనీ సీఎం ఆవిష్కరించారు. అనంతరం నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. జి.సదానందంగౌడ్, జుట్టు గజేందర్ మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడంతో పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణాధికారుల కొరతతో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ చైర్మెన్ కె.కేశవరావుతో చర్చిస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.
ఉపాధ్యాయ సర్వీసు రూల్స్‌ను రూపొందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



