సీఎంకు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
నా పరిధిలోని వాటికి కట్టుబడి ఉన్నా: సీఎం హామీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న ఇండ్లస్థలాలు, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఇండ్లస్థలాలకు సంబంధించి కొత్త విధానం తీసుకురావాలని కోరారు. హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవడం లేదా ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే కొత్త ఆరోగ్య విధానం అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుండగా జర్నలిస్టులు ఆందోళన చెందుతున్న జీవో 252ను వెంటనే సవరించాలని కోరారు. జర్నలిస్టుల మధ్య విభజన తీసుకురావొద్దని చెప్పారు. పాత్రికేయ వృత్తిలో అనేక మార్పులు వస్తున్నాయనీ, రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని విజ్జప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. సీఎంతోపాటు రాష్ట్ర సమాచార, రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో గుర్రం మల్సూర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రికి పుస్తకాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, కార్యదర్శి బి. జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లస్థలాలు, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



