నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మిని స్టేడియం నందు ఎస్ జి ఎఫ్ యు19 బాలుర ఉమ్మడి జిల్లాల హాకీ సెలక్షన్స్ శుక్రవారం నిర్వహించడం జరిగింది. మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల అనగా 3,4, మరియు 5 జనవరి 2026, తేదీలలో వి.ఎం హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్స్, రంగారెడ్డి జిల్లాలోని, సరూర్నగర్ లో జరగబోయే రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల పోటీలకు ఈ యొక్క తుదిజట్టు పాల్గొంటుందని జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి విచ్చేసి మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక మరియు శారీరక ఎదుగుదల ఉంటుందని, ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2% స్పోర్ట్స్ కోట వీరికి ఉద్యోగాల్లో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ యొక్క టోర్నమెంట్లో మొదటి స్థానం తీసుకురావాలని వారిని ఆకాంక్షించారు. ఈ యొక్క కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తు రమణ ,ఫిజికల్ డైరెక్టర్ సడక్ నాగేష్ , నిజాంబాద్ జిల్లా హాకీ సంఘం, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజు, సీనియర్ హాకీ క్రీడాకారులు గంగాధర్ ,(కమర్షియల్ tax dept) తదితరులు పాల్గొన్నారు.



