- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంఈఓ బట్టు రాజేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని గ్రంథాలయం, కిచెన్, గార్డెన్ లను పరిశీలించారు. బడి తోటలో పండిన తాజా కూరగాయలు మధ్యాహ్న భోజనంలో కూరగాయలు వాడుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బోయడ నర్సయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



