Friday, January 2, 2026
E-PAPER
Homeజిల్లాలులైన్మెన్ యాదగిరికి ఘన సన్మానం

లైన్మెన్ యాదగిరికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహించిన యాదగిరి ఇటీవల పదోన్నతి పొంది లక్కోర గ్రామానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తూ గ్రామానికి  సేవలందించినందుకు, లైన్మెన్ గా పదోన్నతి పొందినందుకు హర్షిస్తూ శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో యాదగిరి కు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోలేపల్లి హేమలత లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ ఎంబరి నరసయ్య, వీడీసీ సభ్యులు నరసయ్య, గంగాధర్, లింబాద్రి, కలీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -