Friday, January 2, 2026
E-PAPER
Homeక్రైమ్ఆన్ లైన్ గేమ్ కు యువకుడు బలి

ఆన్ లైన్ గేమ్ కు యువకుడు బలి

- Advertisement -

– చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని యువకుడు ఆన్లైన్ గేమ్ కాల పాటుపడి చేసిన అప్పులు తీర్చలేక గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు.  కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఓం శాంతి కాలనీ కి చెందిన వల్లందేసి గోదావరి గురువారం సాయంత్రం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తనకు ఇద్దరు కొడుకులు సంతానం అని, నా పెద్ద కొడుకు శ్రీనాథ్ కు వివాహం చేశాము. నా చిన్న కొడుకు శ్రీకర్ (30) ఓంశాంతి కాలనీలో ఉంటూ ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడని తెలిపారు. ఏడాదిన్నర కాలం నుండి నా చిన్న కొడుకు ఆన్లైన్ గేమింగ్ ఆడుతూ అప్పులు చేశాడని అన్నారు. అప్పులు భరించలేక మా ఇల్లు అమ్మి కొన్ని బాకీలు కట్టామని, అయినా ఇంకా బాకీలు మిగిలే ఉన్నాయని తెలిపారు. పూర్తిగా ఎంత కట్టాలో మాకు కూడా తెలియదని ఆవేదన చెందారు.

ఈ క్రమంలో నా కొడుకు గురువారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మేము ఎవరూ ఇంట్లో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రోదిస్తూ వెల్లడించారు. తరువాత నా పెద్ద కుమారుడికి ఫోన్ చేయగా వెంటనే ఇంటికి వచ్చాడని, తన తమ్ముడిని ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయిందని, డాక్టర్ పరిశీలించి, అప్పటికే మృతి చెందాడని చెప్పినట్టు వెల్లడించారు. నా కుమారుడి చావుకు కారణం ఆన్ లైన్ గేమ్స్ అని, ఎవరిమీదా అనుమానం లేదని తండ్రి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -