Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్8వ డివిజన్ లో రోడ్డు పనులు ప్రారంభం

8వ డివిజన్ లో రోడ్డు పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-నిజామాబాద్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ లో రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభించినట్టు కాంగ్రెస్ పార్టీ 8వ డివిజన్ ఇంచార్జి, పార్టీ నగర ఉపాధ్యక్షులు జిల్లెల రమేష్ తెలిపారు. ఇటీవల రూ. 3 కోట్ల 43 లక్షల నూడా నిధులతో సీసీ, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఆ పనులను లలితా నగర్ ఫేస్ 1 లో బీటీ రోడ్డు పనులతో ప్రారంభించినట్టు జిల్లెల రమేష్ తెలిపారు. మిగతా చోట్ల సైతం ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే పబ్లిక్ హెల్త్ నుంచి కోటి రూపాయలతో సాయి నగర్ 1, సాయి నగర్ 2, సాయి నగర్ 3 మధ్యలో రోడ్డు పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. డివిజన్ ప్రజలు సహకరిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -