Friday, January 2, 2026
E-PAPER
Homeజిల్లాలుడీటీఎఫ్ 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

డీటీఎఫ్ 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్  పాఠశాలలో డిటిఎఫ్ ఉపాధ్యాయ 2026 క్యాలెండర్ , డైరీ ను శుక్రవారం మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఉమ్మడి డిటిఎఫ్ మండల అధ్యక్షుడు  ఓడ్నాల శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి షేక్ మదర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉపాధ్యాయ మన్నలను పొందుతున్న ఏకైక సంఘం డిటిఎఫ్ అని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తపరిచారు.

డిటిఎఫ్ నినాదం వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతగా ఇందులో చేరిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడానికి అహర్నిశలు కృషి చేస్తారని మండల అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, స్థానిక ఉపాధ్యాయులు దొంద రాములు, సాయి కృష్ణ, శంకర్, సురేష్, రామకిషన్, ,  సంగీత , ఉమా, శ్రీలక్ష్మి ,రూప, పిడి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -