Friday, January 2, 2026
E-PAPER
Homeఖమ్మంకొనసాగుతున్న యూరియా అవస్థలు 

కొనసాగుతున్న యూరియా అవస్థలు 

- Advertisement -

పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రంతో ప్రత్యేక కార్డు
యూరియా పంపిణీని పర్యవేక్షించిన మండల అధికారులు
నవతెలంగాణ – బోనకల్

ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో యూరియా కోసం అన్నదాతలో పడుతున్న అవస్థలు శుక్రవారం కూడా బోనకల్ మండల పరిధిలోనే ముష్టికుంట్ల సొసైటీ కార్యాలయంలో కొనసాగాయి. మండలంలో ఎక్కడా లేనివిధంగా ముష్టికుంట్ల సొసైటీ కార్యాలయంలో యూరియా కోసం రైతుల అవస్థలు శుక్రవారం కూడా కొనసాగాయి. యూరియా కోసం పెద్ద ఎత్తున అన్నదాతలు వస్తుండటంతో సొసైటీ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముష్టికుంట్ల సొసైటీ పరిధిలో ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రామాపురం గ్రామాలు ఉన్నాయి. మండలంలో అతిపెద్ద సొసైటీలలో ముష్టికుంట్ల సొసైటీ ఒకటి. యూరియా కోసం గత ఐదు రోజులుగా అన్నదాతలో పెద్ద ఎత్తున ముష్టికుంట సొసైటీ కార్యాలయానికి వస్తున్నారు.

రైతులకు అనుగుణంగా కొంత అటో ఇటో వ్యవసాయ శాఖ అధికారులు యూరియాను కూడా ముష్టికుంట్ల సొసైటీకి పంపిస్తున్నారు. అయినా అన్నదాతలో యూరియా కోసం ఎగబడుతూనే ఉన్నారు. శుక్రవారం కూడా యూరియా కోసం పెద్ద ఎత్తున అన్నదాతలు సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు. రైతుల ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో సొసైటీ రైతులకు సంబంధించిన భూమి వివరాలతో కూడిన ప్రత్యేకంగా ఓ గుర్తింపు కార్డును ముద్రించింది. పంటల నమోదు సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం పేరుతో ప్రత్యేక కార్డును ముద్రించారు. అందులో పట్టారు పాసు పుస్తకం నెంబర్, పొలం విస్తీర్ణం, రైతు పేరు, ఆధార్ కార్డు నెంబర్, గ్రామం పేరు తదితర వివరాలతో ఈ కార్డుని ముద్రించారు. ఎరువుల వాడకంలో  రెండు దఫాల ఎరువుల మధ్య వ్యవధి కచ్చితంగా 15 నుంచి 20 రోజులు ఉండాలని ఆ కార్డులో స్పష్టంగా ముద్రించారు.

ఈ కార్డులను ప్రతి రైతుకి సొసైటీ సిబ్బంది పేరు, పొలం నమోదు చేసి సంబంధిత రైతులకు అందజేస్తున్నారు. పంట కాలం ముగిసే వరకు ఈ కార్డుల ఆధారంగానే సొసైటీ నుంచి యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని సొసైటీ అధికారులు స్పష్టం చేశారు. ప్రతిరోజు రైతులకు కూపన్ల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నప్పటికీ యూరియా కోసం ప్రతిరోజు పెద్ద ఎత్తున అన్నదాతలు సొసైటీ కార్యాలయానికి క్యూ కట్టడం విశేషం. ఈ క్రమంలో మధిర ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర, డి సి ఓ గంగాధర్ యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 6 గంటలకే వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీ సిబ్బందికి అధికారులకి తగు సూచనలు చేశారు. అదేవిధంగా మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి, ఎంపీడీవో రురావత్ రమాదేవి ఎస్సై పొదిలి వెంకన్న ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.

మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్యదర్శులను ఎరువుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. సుమారు పదిమంది వరకు పంచాయతీ కార్యదర్శులు కౌంటర్లను ఏర్పాటు చేసి సొసైటీ ముద్రించిన రైతు కార్డులపై రైతుకు సంబంధించిన వివరాలను నమోదు చేసి అందజేస్తున్నారు. సొసైటీ పరిధిలో గల ప్రతి రైతుకు ఈ కార్డును పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం వరకు రైతులుకి అందజేసిన కూపన్లకు యూరియా సరిపోలేదు. దీంతో మండల వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం కల్లా యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. దీంతో అనేక మంది రైతులు నిరాశగా వెళ్లారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన పూర్తిస్థాయిలో యూరియాను అందజేస్తామని ఆ రైతుల ఎవరూ ఆందోళన చెందకుండా తమకు సహకరించాలని కోరారు. ఈ యూరియా పంపిణీ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ అజ్మీర లక్ష్మణ్, గిర్దావరులు జంగం గూడెం మైథిలి, షేక్ వహిదా సుల్తానా, ముష్టికుంట్ల, రావినూతల సొసైటీ సీఈఓ లు కొండా రాంబాబు, బోయినపల్లి ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు మొగిలి శివశంకర్, షేక్ సైదులు, ముష్టికుంట్ల సొసైటీ మాజీ అధ్యక్షుడు బోయినపల్లి వెంకటేశ్వర్లు, మాజీ ఉపాధ్యక్షుడు కందికొండ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -