Friday, January 2, 2026
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలి

జన్నారంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలి

- Advertisement -

ట్రైబల్ యూనివర్సిటీ పనులను వేగవంతం చేయాలి పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్..
నవతెలంగాణ – జన్నారం

జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అలాగే ఉట్నూర్ లో  నిర్మించే గిరిజన యూనివర్సిటీ పనులను వేగవంతం చేయాలని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్  ను మర్యాదపూర్వకంగా కలిసి ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి  కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. జరుగుతున్న అసెంబ్లీ, సెషన్ లో జన్నారం మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల  ఏర్పాటు చేసే విధంగా తీర్మానాలు చేయాలని ఆయనను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బొజ్జపటేల్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -