Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోషకాహారంతోనే ఆరోగ్యం సాధ్యం: సీడీపీఓ

పోషకాహారంతోనే ఆరోగ్యం సాధ్యం: సీడీపీఓ

- Advertisement -

– పాల్గొన్న సర్పంచ్ శిరీష 
నవతెలంగాణ – బల్మూరు 

పోషక ఆహారంతోనే ఆరోగ్యం సాధ్యమవుతుందని ఐసిడిఎస్ బల్మూరు ప్రాజెక్టు సీడీపీఓ దమయంతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన ఎన్ హెచ్ డీ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంగన్వాడి కేంద్రాల లబ్ధిదారులు చిన్నారులు బాలింతలు గర్భవతుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ శిరీష, ఉపసర్పంచ్ సీతారాం రెడ్డి ని సమావేశానికి ఆహ్వానించారు.

అంగన్వాడి సేవల పోషకాహారం గురించి తల్లుల కమిటీ ఏర్పాటు గురించి సీడీపీఓ వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రతి గర్భిణీ బాలింత ఒకపూట భోజనం కచ్చితంగా చేయాలని ఇంటికి ఇచ్చే బాలామృతం మరియు గుడ్లు మూడు సంవత్సరాల్లో పిల్లలకు కచ్చితంగా తినిపించాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సర్పంచ్ సూచించారు. అంగన్వాడీ కేంద్రానికి మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను ప్రతి తల్లి పంపించాలని ప్రీస్కూల్ విద్యను అభ్యసించాలని ప్రైవేట్ కు పంపవద్దని ఉప సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మణ్, సూపర్వైజర్ నిర్మల అంగన్వాడి టీచర్లు జయప్రదం, సునీత, నీలాబాయి, శ్రీదేవి, భాగ్యమ్మ మరియు తల్లులు పిల్లలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -