నవతెలంగాణ – మిడ్జిల్
ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వ కళాశాలలోనే చేరాలని జడ్చర్ల డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుకన్య అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జడ్చర్ల డిగ్రీ కళాశాలలో చేరాలని అవగాహన కల్పించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వము పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. ఈరోజు ఎంతో మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చదువుకుంటే అనుకున్న లక్ష్యాలకు చేరుకుంటారని సూచించారు. జడ్చర్ల పట్టణంలో అతి పెద్ద కళాశాల అని, స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాల ఎంతోమంది డాక్టర్ కలిగిన అధ్యాపకులు ఉన్నారని చెప్పారు. అనంతరం
కళాశాల విద్యార్థులకు అధ్యాపకులు రాఘవేంద్ర రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి వారినీ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి ఒక్కరూ చేరాలని చెప్పారు. క్విజ్ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ కళాశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య ,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు, , నాగరాజు,శివుడు, ఆదిల్,నరసింహ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య, ఇన్చార్జి ప్రిన్సిపాల్ ,అక్తర్, చరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



