Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షునిగా కంతి మధు

సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షునిగా కంతి మధు

- Advertisement -

ఉపాధ్యక్షునిగా బోరిలాల్ నాయక్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండల సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షునిగా శారాజుపేట గ్రామ సర్పంచ్ కంతి మధును సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా మండల సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షునిగా కంది గడ్డ తండా సర్పంచ్ బోరిలాల్ నాయక్ ఎంపిక చేశారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో ఆలేరు మండలంలోని పలువురు గ్రామ సర్పంచ్‌లు పాల్గొన్నారు. మందనపల్లి గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక, సాయి గూడెం గ్రామ సర్పంచ్ గ్యార కవిత సంపత్, పటేల్ గూడెం గ్రామ సర్పంచ్ గ్యార కుమారస్వామి, గొలనుకొండ గ్రామ సర్పంచ్ ఇందూరి యాదిరెడ్డి, మంతపురి గ్రామ సర్పంచ్ పసుల సతీష్ రెడ్డి, కొల్లూరు (జనగాం) గ్రామ సర్పంచ్ సుధారాణి శ్రీపాల్ రెడ్డి, బైరాంనగరం గ్రామ సర్పంచ్ కంప రాజు వెంకటేశ్వరరాజు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి సురేష్ గౌడ్, కందడి శేఖర్ రెడ్డి, ప్రశాంత్, కమలేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -