నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ నూతన పంచాయతీ పాలకవర్గం సభ్యులను స్వదేశీ జాగరణ మంచ్ అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు, బ్రహ్మకుమరి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, వార్డ్ సభ్యులు కుందేటి శ్రీనివాస్, దేవాయి రాజేశ్వర్, నాయిని మురళీ, గడ్డం గణేష్, సురకంటి రాజేశ్వర్, బంగ్లా దేవదాస్ లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా స్వదేశీ జాగరణ మంచ్ అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు
మాట్లాడుతూ గ్రామానికి, గ్రామ ప్రజలకు మంచి సేవలను అందించాలన్నారు. గ్రామాలు మంచి ప్రగతినీ సాధించేలా అభివృద్ధి పరచాలని కోరారు.
పాలకవర్గ సభ్యులకు బ్రహ్మకుమారి సంస్థ క్యాలెండర్లను అందజేశారు.



