Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వల్ప కాలంలోనే పీఏసీఎస్ తాడిచెర్ల అభివృద్ధి.!

స్వల్ప కాలంలోనే పీఏసీఎస్ తాడిచెర్ల అభివృద్ధి.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ స్వల్ప కాలంలోనే అభివృద్ధి హంగులతో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. మరింతగా అభివృద్ధికి చేరుకునే దిశలోనే ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసి, ప్రత్యేక పాలనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కోడెఫి నెలల్లోనే తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ గా ఇప్ప మొండయ్య ఆగస్టు 2024న చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.16 నెలల కాలంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో సొసైటీ భవన నిర్మాణ ఆధునికరణ పున.ప్రారంభం పనులు రూ.40 లక్షలతో చేపట్టారు.

ఇందులో భాగంగా పర్మిచర్, స్ట్రాంగ్ రూమ్, కంపండ్ వాల్, గోల్డ్ లోన్ పర్మిషన్, తదితర పనులు చేపట్టారు. రూ.12 లక్షలతో మెయిన్ రోడ్డు నుంచి కమన్, సొసైటీ వరకు సిసి రోడ్డు నిర్మాణం చేశారు. మూడు ధాన్యం కొనుగోలు సీజన్లలో సుమారుగా 3లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.కోటి వరకు సొసైటీ కమిషన్ రూపంలో ఆదాయాన్ని తీసుకొచ్చారు. అలాగే మూడు సీజన్ల ఎరువులు విక్రయాల్లో రూ.20 లక్షల ఆదాయాన్ని సొసైటీలో జమ చేశారు. సొసైటీ మరింతగా ఆదాయం పెంచడానికి పెట్రోల్ బంకు, ఎల్జీ గ్యాస్ గోదాం అనుమతుల కోసం ప్రపోజల్ పెట్టారు. ఇదే చైర్మన్ కు మరికొన్ని ఏళ్ళు ప్రభుత్వం అవకాశం ఇస్తే మంరింతగా అభివృద్ధి జరగవచ్చని సొసైటీలో ఉన్న సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -