నవతెలంగాణ – దర్పల్లి
ఇటీవల స్థానిక ఎన్నికల్లో కొలువు దీరిన గ్రామ సర్పంచులు వారి పాలక వర్గ సభ్యులు, శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను తన నివాసంలో కలిసి ఆశీస్సులు పొందారు. ఈసందర్బంగా మండలంలోని హోన్నజీపేట, సీతాయిపేట గ్రామ సర్పంచులు మద్దికుంట ఆశవ్వ,ఇంద్ర నగర్ తండా సర్పంచ్ బాలు, సీతాయిపేట సర్పంచ్ భూమేష్ లు తమ పాలక వర్గ సభ్యులను మాజీ ఎమ్మెల్యేతో కలిసి భవిషత్తు కార్యాచరణపై చర్చించారు. అభయం తీసుకున్నారు.ఈసందర్బంగా మరో కొద్దీ రోజులు ఓపిక పట్టండి, రానున్న రోజులు మనవే అని తమ నాయకుడు అభయం అందించినట్లు, ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి ఆపే శక్తి ఎవ్వరికి లేవని కేంద్ర, రాష్ట్రాల అభివృద్ధి నిధులు అందరితోపాటు నీరు మీఖతల్లో వస్తాయని ఎవ్వరికి భయపడాల్సిన పని లేదని, త్వరలో బిఆర్ ఎస్ ప్రభుత్వం రానుందని, తిరిగి కేసీఆర్ ఆధ్వర్యలో మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నట్లు వారు తెలిపారు. కార్యక్రమములో మాజీ జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్,మాజీ ఎంపీపీ నల్ల సారిక హన్మంత్ రెడ్డి,నాయకులు రాజపాల్ రెడ్డి, అబ్దుల్ మజీద్, కోతి శేఖర్ రెడ్డి,నజీర్, శంకర్ నాయక్, సభవత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



